బెంగళూరులో ఇంటి అద్దెలు అధికంగా ఉంటాయని తెలిసిందే. అయితే అద్దెల కన్నా అడ్వాన్స్లే దడ పుట్టిస్తున్నాయి. బెంగుళూరులో ఉద్యోగిని ఓ అపార్ట్మెంట్లో అద్దె కోసం వెళ్లగా రూ.40 వేలు రెంట్ ఉన్న గదికి రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలని యజమాని కోరారట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా.. తాము కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తెలిపారు.