TG: ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సన్నాలు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో 60.39 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని, 146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు.ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.