TDP జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సడెన్‌గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. అయితే ఈ టూర్ మాత్రం అధికారికం కాదని అంటున్నారు. నారా లోకేష్ కేంద్ర పెద్దలను కలుస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో నామినేటెడ్ పదవుల పంపిణీ, రాజ్యసభ ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీ, తిరుమల లడ్డూ వివాదంపై కూడా కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.