బైడెన్‌కు నెలలో రూ.750 కోట్లు.. ట్రంప్‌కు ఒక్కరోజే రూ.420 కోట్లు

73చూసినవారు
బైడెన్‌కు నెలలో రూ.750 కోట్లు.. ట్రంప్‌కు ఒక్కరోజే రూ.420 కోట్లు
రాబోయే అధ్యక్ష ఎన్నికల కోసం బైడెన్, ట్రంప్ ప్రచార బృందాలు పోటాపోటీగా విరాళాలు సేకరిస్తున్నాయి. మార్చిలో 90 మిలియన్ డాలర్లకు(రూ.750కోట్లు) పైగా విరాళాలను సమీకరించినట్లు బైడెన్ ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. ఓటర్ల మద్దతు కూడగట్టేందుకూ వీటిని వినియోగిస్తున్నట్లు పేర్కొంది. ఇక శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఒక్కరోజే 50.5 మిలియన్ డాలర్లు(రూ.420 కోట్లు) సమీకరించినట్లు ట్రంప్ ప్రచార బృందం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్