బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు షాకింగ్ ప్రశ్న ఎదురైంది. సల్మాన్ ఖాన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఆమె పోస్ట్ పెట్టగా.. ఆయనతో డేట్‌లో ఉన్నారా? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనిపై ఆమె సల్మాన్ తనకు కుటుంబసభ్యుడితో సమానం అని స్పష్టం చేశారు. ‘‘మేమిద్దరం అస్సలు డేట్ చేయలేదు. తను నాకు కుటుంబసభ్యుడితో సమానం. అలాగే నా భర్తకూ అతను మంచి ఫ్రెండ్. నా సమాధానంతో మీరు ఆశ్చర్యానికి గురైతే నన్ను క్షమించండి’’ అని తెలిపారు.