AP: ఎన్నిసార్లు చెప్పిన కొంత మంది ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవడం లేదని సీఎం చంద్రబాబు ఫైర్ అయినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు దందాలకు తెరలేపినట్లు ఆరోపణలు వినిస్తున్నాయి. మరికొందరు తమ వ్యాపారాల్లో తీరిక లేకుండా గడుపుతూ ప్రజలకు దూరమవుతున్నారు. ఇలా ప్రజా సేవను సెకండ్ ప్రయార్టీగా భావిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పిలిచి సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.