రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ- బెహ్రర్ జిల్లాలో చేతన అనే చిన్నారి తండ్రి పొలంలో ఆడుకుంటూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటన సోమవారం జరగ్గా, ఇప్పటికి ఆరో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, స్థానిక పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పైపుతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.