సందీప్ కిషన్ కొత్త సినిమా ప్రారంభం

79చూసినవారు
సందీప్ కిషన్ కొత్త సినిమా ప్రారంభం
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా #SK30 వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. ఈ కార్యక్రమానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హాజరై ఫస్ట్ క్లాప్ కొట్టారు. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్ కథని అందించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్