సీఎం జగన్ కీలక హామీ

80చూసినవారు
సీఎం జగన్ కీలక హామీ
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం విశాఖకు చేరుకుంది. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సీఎంను కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మికులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి కృషి చేస్తున్నామని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్