సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామంలో గురువారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి తిరుగుతూ, ఇంటి తలుపులకు స్టిక్కర్లు అతికించారు. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్ శంకర్ మాట్లాడుతూ గ్రామంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలు సేకరించడానికి ఇంటింటికి వస్తామని, సంబంధిత వివరాలు చెప్పాలని కుటుంబ యజమానులకు చెప్పారు.