ప్రశాంతంగా పదో తరగతి మొదటి పరీక్ష

352చూసినవారు
ప్రశాంతంగా పదో తరగతి మొదటి పరీక్ష
పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా మొదటిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మెదక్ జిల్లా అల్లాదుర్గం, గడి పెద్దాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 239 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. గడి పెద్దాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకరు విద్యార్థి గైర్హాజరు కావడంతో 238 మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా విద్యా శాఖ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పరీక్ష కేంద్రాల వద్ద  ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్