ఇంకా ప్రారంభం కాని రేషన్ బియ్యం పంపిణీ

1667చూసినవారు
ఇంకా ప్రారంభం కాని రేషన్ బియ్యం పంపిణీ
మెదక్ జిల్లా, అల్లాదుర్గం మండలం వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వ ద్వారా సరఫరా చేసే రేషన్ బియ్యం మే 14 రోజులు అయినా అందని రేషన్ బియ్యం అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14 అయిన రేషన్​ బియ్యం పంపిణీని ఇంకా మొదలుపెట్టలేదు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం పంపిన బియ్యాన్ని పంపిణీ చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన బియ్యం స్టాక్‍ ను రేషన్​ షాపులకు పంపకుండా జాప్యం చేస్తున్నది. సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీ నుంచే బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది. మే నెలలో మాత్రం 14 రోజులు గడిచినా రేషన్ ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

రేషన్ షాపు డీలర్లతో గొడవకు దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమిచ్చే బియ్యం సరుకులు, తిండితో పాటు పిండి వంటలకు పనికొస్తాయని ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్