పండగలు శాంతియుతంగా జరుపుకోవాలి: సిఐ జార్జి

743చూసినవారు
పండగలు శాంతియుతంగా జరుపుకోవాలి: సిఐ జార్జి
అన్ని కులమతాలు నిర్వహించుకుంటున్న పండుగలను గ్రామాలలో శాంతి యుత వాతావరణంలో నిర్వహించుకోవాలని మెదక్ జిల్లా అల్లాదుర్గం సీఐ జార్జి అన్నారు. మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ లో పీస్ కమ్యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ జార్జ్ మాట్లాడుతూ ఏప్రిల్ 6 న నిర్వహించే హనుమాన్ జయంతి ఉత్సవాలలో గుడ్ ఫ్రై డేలో ఎలాంటి  అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా చూడాలన్నారు.

ఎవరు కూడా కుల మతాలకు సంబంధించి వ్యతిరేక నినాదాలు చేయకూడదని అన్నారు. పోలీస్ శాఖకు సహకరించి అందరూ కలిసి మెలిసి సోదర భావంతో పండుగ ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి, నాయకులు బలరాం, కాయిందం పల్లి మాజీ సర్పంచ్ బాలకిషన్ , ఆటో యూనియన్, పోలీస్ సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్