రేగోడ్ మండల కేంద్రంలో క్రికెట్ వారియర్స్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెట్ వారియర్స్ నుండి తొమ్మిది రోజుల పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.