ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం

659చూసినవారు
ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం
ఉగాది పండగను పురస్కరించుకొని మెదక్ జిల్లా అల్లాదుర్గంలో మార్కండేయ దేవాలయంలో పంచాంగశ్రవణ  కార్యక్రమాన్ని నిర్వహించారు. శోభకృత్‌ నామ సంవత్సరం పంచాంగాన్ని వేద పండితులు శీలం కోట నారాయణ చారి పఠించారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందన్న విషయాలను తెలియజేశారు. ఈ ఏడాది చిరు ధాన్యాలకు మంచి గిరాకీ  లభిస్తుందన్నారు. గోవులను సంరక్షణ చేయాలని అన్నారు. అలాగే పంటలు బాగా పండి రైతులకు మోక్షం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్