ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

450చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
అందోల్: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్, కాయిందం పల్లి, రాంపూర్, తదితర గ్రామాల్లో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపిపి కాశీనాథ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మూడు వరి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ-గ్రేడ్‌ ధాన్యం ధర రూ. 2080, సీ-గ్రేడ్‌ రూ. 2040 చొప్పున ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామాల్లో దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ యస్ మండల పార్టీ అధ్యక్షుడు పల్లె గడ్డ నర్సింహులు, మాజీ సర్పంచ్ రామా గౌడ్, ఎంపిటిసి దశరత్, ఎపియం నాగరాజు, కాయిందం పల్లి సర్పంచ్ బేతయ్య, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్