కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

1739చూసినవారు
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకం యావత్ ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దేనని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా వట్ పల్లి లోని ఆర్ ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం, రేగోడ్, వట్పల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రెక్కాడితే గాని డోక్కాడని పేదలు తమ ఆడబిడ్డల పెళ్లి కోసం అప్పులు చేసి, ఆ అప్పులకు మిత్తిలు కట్టి అనేక ఇబ్బందులు పడే వారన్నారు. ఈ ప్రపంచంలో గొప్ప దేశాలైన అమెరికా, చైనా, రష్యా లో కానీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల ఇంటి మేనమామగా మారి ఆడబిడ్డ పెళ్లికి రూ1, 00, 116/- కానుక అందిస్తున్నారన్నారు.

గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉండే పరిస్థితి ఉండేదని నేడు 24 గంటలు విద్యుత్తు, పుష్కలంగా నీరు ఉందని టెలికాం అడ్వైస్ మెంబెర్ కాశీనాథ్ కోనియాడారు. పేదలకు, వృద్ధులకు వితంతువులకు ఆసరా పింఛన్లు, మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు కెసిఆర్ అమలు చేస్తున్నారన్నారని, తెలంగాణ కోసం కెసిఆర్ ను బలోపేతం చేయాలని, కెసిఆర్ నిండు నూరేళ్లు బ్రతికేలా దీవెనలు, ఆశీర్వచనాలను అందివ్వాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో మైనారిటీలకు ఎమ్మెల్యే రంజాన్ తోఫాను అందజేశారు.

ఈకార్యక్రమంలో అల్లాదుర్గం తహసీల్దార్ తులసిరాం, మాజీ ఎంపిపి కాశీనాథ్, మైనారిటీ కో ఆఫ్షన్ సయ్యద్, అల్లాదుర్గం సర్పంచ్లు ఫోరమ్ అధ్యక్షుడు అంజియాదవ్, పిఎసిఎస్ చైర్మన్ దుర్గా రెడ్డి, అల్లాదుర్గం మండలం ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అన్ని కమిటీల అధ్యక్షులు, పిఎసిఎస్ డైరెక్టర్లు, అల్లాదుర్గం  బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పల్లె గడ్డ నర్సింలు, అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్