చిల్వేర్ లో పెంకుటిల్లు దగ్ధం

1333చూసినవారు
చిల్వేర్ లో పెంకుటిల్లు దగ్ధం
మెదక్ జిల్లా ,అల్లాదుర్గం మండలంలోని,చిల్వేర్ గ్రామ పంచాయతీ భవనం ముందు మొల్ల బేగం అనే మహిళకు చెందిన ఇల్లు గత కొన్నేడ్లుగా నిరుపయోగంగా ఉంది. ఇంట్లో కొన్ని కట్టెలు, చెత్తతో నిండి ఉండటంతో మధ్యాహ్నం అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఆది చూసిన గ్రామస్థులు పెద్దశంకరంపేట ఫైరింజన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది సుమారు గంటసేపు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చి ఆర్పివేశారు. సకాలంలో ఫైరింజన్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొని రావడంతో పెను ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్