రేగోడ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్ పి

1184చూసినవారు
రేగోడ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్ పి
అందోల్: మెదక్ జిల్లా రేగోడ్  పోలీస్ స్టేషన్ లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మెదక్ జిల్లా ఎస్. పి. పి. రోహిణి ప్రియదర్శిని పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కేసులకు సంబంధించిన రికార్డులు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో ఆమె మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా వుంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజల మధ్యలో  ఉంటూ పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న పోలీసుల పాత్రే కీలకంగా ఉంటుందని తెలిపారు. కాబట్టి సిబ్బంది పోలీసు స్టేషన్ లోని ప్రతి గ్రామం గురించి అవగాహాన కల్గి వుండాలని, ప్రజలతో మమేకమై, ప్రజలకు మరింత చేరువ అవడానికి  కమ్యూనిటీ పోలిసింగ్ మరియు ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానన్ని అమలు పరచాలని, అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞాణంను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ పిట్టి కేసులు, ఈ చాలన్స్ కేసులలో, ఫెసియేల్, ఫింగర్ ప్రింట్ లలో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం కావున వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలిస్ స్టేషన్ పరిధిలో గస్తీ వాహనాలను నిరంతరం తమ వాహనం గస్తీలో తిప్పాలని, బీట్లు మరియు పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. స్టేషన్ రికార్డులను, పరిసరాలను, శుభ్రంగా ఉంచాలని తెలిపారు, సిసి కెమెరాల టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత దగ్గరై సేవలు చేయడానికి సీసీ కెమెరాలు ఉపకరిస్తాయని, సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ఆ ప్రదేశంలో నేరాలు ప్రభావితంగా నిరోధించగలం అని, నేరాల నియంత్రణతో పాటు దర్యాప్తు చేధనకు దోహదపడే సి. సి. కెమెరాలను “నేను సైతం” కార్యక్రమాల ద్వారా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సి. సి. కెమెరాల ఏర్పాటులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములుగా చేయాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో అల్లాదుర్గ్ సి. ఐ. జార్జ్ , ఎస్ ఐ సత్యనారాయణ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్