వాహన తనిఖీల స్పెషల్ డ్రైవ్.. ధృవపత్రాలు సరిగా లేకపోతే సీజ్

937చూసినవారు
వాహన తనిఖీల స్పెషల్ డ్రైవ్.. ధృవపత్రాలు సరిగా లేకపోతే సీజ్
అందోల్ , మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం లోని అప్పాజి పల్లి గ్రామంలో శనివారం ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని వాహనదారులను తెలిపారు. నెంబర్ ప్లేట్స్, వాహన ధూపత్రాలు లేని వాహనాలతో పాటు వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా  సీఐ జార్జ్ వాహనదారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. వాహనదారులు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ప్రమాదాల నివారణకు నియంత్రిత వేగంతో ప్రయాణించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు విరుద్ధంగా వాహనాలు నడిపితే కేసులతో పాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నెంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మెదక్ జిల్లా ఎస్పీ పి. రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ జార్జ్, ఎస్ ఐ ప్రవీణ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్