గుమ్మడిదల: పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ
గుమ్మడిదల మండలం కానుకుంట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న సమ్మేటివ్ పరీక్షలను, విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించారు. అనంతరం డిఈఓ మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పదో తరగతి పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.