గురువారం వీరన్నగూడెం గ్రామ పంచాయితీ బొంతపల్లి నుండి వేరు పడి కొత్త పంచాయతీ కావడంతో అక్కడ సర్పంచ్ మమత వేణు చెట్ల పెంపకం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి ఇంటికీ తొట్టిలతో సహా చెట్లు పంచాయతీ పరిధిలో ఇవ్వడం జరిగింది. పూల, పండ్ల చెట్లు పెంచితే అన్నింటికీ లాభం అని ప్రతి ఇంటి ఆవరణలో 5 నుంచి 10 చెట్లు పెంచాలని కార్యదర్శి సంధ్య రాణి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ తో సహా వార్డ్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు వేణు విజయవంతం చేయడం జరిగింది.