గుమ్మడిదల మండలంలో వ్యక్తి అదృశ్యం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరి (41) అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. సీతాఫలములు తీసుకువస్తానని ఇంటి నుండి వెళ్లిన దస్తగిరి తిరిగి రాకపోవడంతో భార్య సాహెద్ బేగం చుట్టుపక్కల మరియు బంధువుల వద్ద ఆచూకీ కోసం చూడగా లభించలేదు. దీంతో గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుమ్మడిదల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.