నాణ్యత లేని భోజనం పెడుతున్న అక్షయా పాత్ర

2648చూసినవారు
నాణ్యత లేని భోజనం పెడుతున్న అక్షయా పాత్ర
గుమ్మడిదల మండలంలోని కానుకుంట గ్రామం ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని పిల్లలు తినకుండా రోజు వారిగా అన్నము పడేస్తున్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం కూడా కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న యువకులు నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేశారు. పిల్లలు కూడా భోజనం పడేసే ఫోటోలు తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ప్రతి పాఠశాలలో ఇదే పరిస్థితి జరుగుతుందని మండలానికి చెందిన కొన్ని గ్రామాల నాయకులు కూడా చెప్పడం కొసమెరుపు. ప్రభూత్వానికి సంబంధించిన అధికారులు, మండలం నాయకులు అక్షయా పాత్ర వారితో మాట్లాడి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నారు .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్