గుమ్మడిదల మండలం నల్లవల్లి పరిధిలోని ప్యారా నగర్ లో ఏర్పాటు చేయనున్న గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి డంపింగ్ యార్డును తక్షణమే నిలపివేయాలని కోరుతూ మంగళవారం గుమ్మడిదల అఖిలపక్ష నాయకులు ఎంపీ రఘునందన్ రావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అడవి ప్రాంతం పచ్చటి వాతావరణంతో కూడిన మండలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం కారణంగా పూర్తిగా కలుషితంగా మారుతుందన్నారు. తక్షణమే నిలిపివేయాలని కోరారు.