కల్హేర్: అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
కల్హేర్ మండల రాపర్తి గ్రామంలో బీ. ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో యువత నడుచుకోని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్, తదితరులు పాల్గొన్నారు.