సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి బి క్లస్టర్ రైతు భీమా దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ఘనపూర్ గ్రామంలో గురువారం రైతు భీమా దరఖాస్తులను ఏఈవో సంధ్య స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాటాడుతూ, రైతులు ఈ భీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భీమా ద్వారా ధైర్యంగా ఉండాలి అని తెలియచేశారు. ఆగష్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు రూప్సింగ్, నర్సింలు, మారుతి, బాలాజీ, తదితరులు ఉన్నారు.