కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో శ్రీ దుర్గా మాత శోభాయాత్ర ఘనంగా ప్రారంభించారు. తొమ్మిది రోజులపాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఆదివారం దుర్గామాత నిమజ్జనం కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మవారి మండపం నుంచి రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన వాహనంలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్లొన్నారు.