నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని పలువురు ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని సోమవారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది. వారితోపాటు మండల తాజా మాజీ జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, మాజీ ఎంపిటిసి ముజామిల్, తదితరులు ఉన్నారు.