రహదారుల అభివృద్ధికి పెద్దపీట: నారాయణఖేడ్ ఎమ్మెల్యే

74చూసినవారు
రహదారుల అభివృద్ధికి పెద్దపీట: నారాయణఖేడ్ ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. కంగ్టి మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుండి తడ్కల్ వైపు వెళ్లే ఒక కిలో మీటర్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన సంవత్సరంలోపే రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు నిధులతో బీటి రోడ్డు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు.