సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో వంగల్పెట్ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ చౌక్ వద్ద శనివారం ముదిరాజులు వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. తరువాత ముదిరాజ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముని దివ్య చరిత్రను సంపూర్ణ మానవాళికి పరిచయం చేసింది ఆదికవి వాల్మీకి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్కారి సత్యనారాయణ ముదిరాజ్, అవుటి శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.