మత్తడి దూకుతున్న అక్కమ్మ చెరువు

72చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిన్నారం మండల కేంద్రంలోని అక్కమ్మ చెరువు మత్తడి దూకుతుంది. అలుగు పారడంతో పెద్ద ఎత్తున సందర్శకులు చెరువు వద్ద వచ్చి ఈ అందమైన దృశ్యాలను తమ సెల్ఫోన్లో బంధిస్తున్నారు. వర్షాలు బాగా పడి చెరువు నిండడంతో ఈ ఏడు పంటలు బాగా పండుతాయి అని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్