బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్న బస్తికి చెందిన బొల్లారం పబ్లిక్ స్కూల్లో శనివారం బోనాల పండుగ ఉత్సవాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ యువత నాయకుడు ప్రవీణ్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు.