సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలోని విద్యార్థులకు కేవలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 5వ తరగతి వరకే ఉండడం, ఆపై చదువుల కొరకు మండల కేంద్రమైన గుమ్మడిదలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పించాలని శుక్రవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని మంబాపూర్ గ్రామ ప్రజలు కోరారు.