సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి మహిళా భక్తులు బోనాలు సమర్పించి పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పలారం బండి ఊరేగింపులో మాజీ ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రారెడ్డి, జైపాల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.