ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడటమే హైడ్రా ప్రధాన కర్తవ్యమని కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. హైడ్రా చర్యల వల్ల FTL, బఫర్ జోన్‌లు, అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ప్లాట్లు కొనేవారు జాగ్రత్తగా ఉంటున్నారని అన్నారు. 'నాలాలకు సంబంధించి కూడా కిర్లోస్కర్‌తో సమన్వయం చేసుకుంటున్నాం. మున్సిపాలిటీల్లో అనధికార నిర్మాణాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. వరద నివారణ చర్యలు చేపడతాం' అని తెలిపారు.