సదాశివపేట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సదాశివపేట పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ముందున్న లారీ టైర్ పంచర్ కావడంతో హైవే పక్కకు ఆపి రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రెండు వాహనాల మధ్య ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీశారు. నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.