సదాశివపేట: అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య
సదాశివపేట మండలం మాల్ పహాడ్ కు చెందిన మల్లగొని రంజిత్(19) ను ప్రియురాలి బంధువులు కొట్టడంతో అవమానం భరించలేక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులు రంజిత్ బైక్ ను గుర్తుపట్టి అతని తండ్రికి తెలుపగా, ఆయన చెరువులో గాలింపు చేపట్టగా రంజిత్ మృతదేహం దొరికింది. రంజిత్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.