డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు తొలిరోజైన బుధవారం 251 మంది అభ్యర్థులు హాజరయ్యారని డిఈవో వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 5వ తేదీ వరకు ప్రతిరోజు ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని చెప్పారు. 1వ తరగతి నుంచి బిఈడి వరకు అన్ని రకాల సర్టిఫికెట్లు తీసుకురావాలని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 33 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.