సదాశివపేట లోని మైనార్టీ గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ మాధురి సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని స్టోర్ రూమ్, భోజనశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం రుచికరంగా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ సరస్వతి, కమిషనర్ ఉమ, మండల విద్యాధికారి శంకర్ పాల్గొన్నారు.