సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో గల శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవస్థానం చతుర్థ శతమ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శ్రీ గురు మాదవానంద సరస్వతీ స్వామి ఆశీస్సులతో జ్యోషి రామారావు శర్మ వారి వైదిక నిర్వహణ లో వేద పండితులు గురు వందనం, గణపతి పూజ, ధ్వజారోహణం, రుద్రాభిషేకం, గణపతి, రుద్ర హోమం, చండీ హోమం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇట్టి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ నిర్వాహకులు అమరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గంగన్న, ఎం పీ టీ సీ సత్యనారాయణ వార్డు సభ్యులు గురురాజ్ స్వామి, బాగన్న, ఆలయ కమిటీ సభ్యులు వీరన్న, రాములు, సదాశివుడు, భీమన్న, శివకుమార్, కృష్ణ, గ్రామ పెద్దలు, ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.