మండల కేంద్రమైన హత్నూరలో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రజలకు అందిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించి ప్రజలకు ప్రజల పక్షాన నిలబడుతూ రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఆసరా పింఛన్, అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత మన సీఎం కేసీఆర్ కె దక్కుతుందని అన్నారు. అర్హులైన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు అందించిన రూపాయలను వృధా కాకుండా అవసరాలకు వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వావిలాల నర్సింహులు, జెడ్పిటిసి ఆంజనేయులు, సర్పంచ్ వీరస్వామి గౌడ్, వాయిస్ ఎంపీపీ లక్ష్మీ రవి కుమార్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమన్వయ కమిటీ కో ఆప్షన్ నెంబర్ బుచ్చిరెడ్డి, టిఆర్ఎస్ యువజన అధ్యక్షులు కిషోర్, పట్టణ అధ్యక్షులు అజ్మత్ అలీ , సర్పంచులు సుధాకర్, సునీత రాజు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.