శిథిల భవనాల్లో తరగతులు నిర్వహించవద్దని మండల విద్యాధికారి శంకర్ అన్నారు. సదాశివపేట మండలం నంది కంది ఉన్నత పాఠశాలలో కురుస్తున్న గదులను గురువారం పరిశీలించారు. ఈ గదుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వినయ్ కుమార్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బసవరాజ్ పాల్గొన్నారు.