బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీలో నివసించే వృద్ధురాలు ఎల్లమ్మ (80) అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ వి. వి. ఆర్ ఫౌండేషన్ తరపున అంత్యక్రియల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.