సదాశివపేట మండలం పెద్దాపూర్ లోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో లక్ష దీపోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయంలో దీపాలను వెలిగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి కి ప్రత్యేక పూజలు చేశారు.