సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ సభ మరియు కురుమ సంఘం భవన నిర్మాణం భూమి పూజ కార్యక్రమం 26 వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు బూరుగడ్డ నగేష్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమాలలో కురుమలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమములను విజయవంతం చేసి మన కురుమల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగేష్ కురుమ, సంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షులు ప్రవీణ్ కురుమ, మాజీ డైరెక్టర్ నగేష్ కురుమ, కుల పెద్దలు, గ్రామ పెద్దలు సత్యనారయణ, రాందాస్, సదాశివుడు, గొఱ్ఱెకాపరుల సహకార సంఘం అధ్యక్షుడు రవికాంత్, సంఘం నాయకులు రమేష్, బాగన్న, మల్లేష్, శ్రీకాంత్, మురళి మోహన్, కృష్ణ, లక్ష్మయ్య, నర్సింలు కుల భాందవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.