సంగారెడ్డి నియోజక వర్గంలో గల వివిధ గ్రామాలు, తండాల్లోని యువకులు, మహిళలు పెద్దయెత్తున స్థానిక నియోజక వర్గం సీనియర్ నాయకులు శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో మల్కాపూర్ గ్రామ శివారులో గల హైదరాబాద్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన సమావేశంలో జిల్లా బీ జే పీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి సమక్షంలో 350 కి పైగా పార్టీ లోకి చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శివరాజ్ పాటిల్, సత్యనారాయణ, సంగమేశ్వర్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.