సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు గుండు శివకుమార్ రావి పత్రం పై భారతదేశం పటాన్ని రూపొందించి అందరిని అబ్బురపరిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాజ్యం కోసం తమ జీవితాలను అర్పించిన దేశ భక్తుల స్ఫూర్తి తో, మహనీయులు కలలుగన్న నవ భారత నిర్మాణం దిశగా ప్రతీ ఒక్కరు అడుగులు వేయాలని తెలిపారు.