సదాశివపేట పట్టణంలో అయ్యప్పస్వామి స్వర్ణ ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. 108 రోజులపాటు కఠిన దీక్ష చేసిన అయ్యప్ప దీక్షాదారులు స్థానిక సంఘమేశ్వర దేవాలయం నుంచి అయ్యప్ప దేవాలయం వరకు స్వామివారి స్వర్ణ ఆభరణాలను తలపై మోశారు. అయ్యప్ప స్వామి భక్తులు వృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.