సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 75% సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని 32వ వార్డులో సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ సర్వేలో ప్రజల స్థితిగతులపై అధ్యయనం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.